Mahaa Chairman

అది మానవ హక్కుల ఉల్లంఘనే: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

శ్రీవారి దర్శనం అంటే మాటలు కాదు. తిరుమల చేరుకోవడం ఒక ఎత్తయితే.. అక్కడ స్వామి దర్శనం కోసం వేచి ఉండడం మరో పెద్ద పరీక్ష. ఒక్కోసారి 30 గంటలకు పైగా కంపార్ట్మెంట్స్ లో భక్తులు ఎప్పుడు తమ వంతు వస్తుందా అని ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. తీరా ఇంత కష్టపడి దేవదేవుని వద్దకు చేరుకునే సరికి ఆయనను కనులారా చూసే భాగ్యం కూడా దక్కదు. ఒకటి రెండు సెకన్లు.. ఇంకా చెప్పాలంటే రెప్పపాటు సమయంలోనే మహాలఘు దర్శనం పేరుతో భక్తులను పక్కకు జరిపిస్తారు. లిప్తపాటులో స్వామివారిని చూసి తరించిపోయామని భక్తులు భావిస్తారు. కానీ, వారి మనస్సులో ఒక పక్క తీవ్ర అసంతృప్తి ఉంటుంది. ఎక్కడో బాధ ఉంటుంది. దర్శనం చేసుకుని బయటకు వచ్చాకా వేంకటేశుని దర్శన భాగ్యం కన్నా ఎక్కువగా తాను పడ్డ బాధనే గుర్తు చేసుకుంటూ భారంగా తిరుగు ప్రయాణం అవుతారు. 

ఇది కూడా చదవండి :  వాళ్ల కథ శ్రీవారే చూసుకుంటారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

ఇదిగో ఈ విధానమే మారాలని అంటున్నారు టీటీడీ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు. రైతు కుటుంబంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్ చేరి.. వ్యాపారవేత్తగా మారి.. మీడియా ప్రతినిధిగా ఎదిగి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా శ్రీవారి భక్తులకు సేవ చేస్తుకుని అపూర్వ అవకాశం అందుకున్న బీఆర్ నాయుడు..  మహా న్యూస్ ఛైర్మన్ మారెళ్ల వంశీకృష్ణతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన జీవిత ప్రస్థానం.. శ్రీవారి భక్తునిగా తన అనుభవాలు.. రాజకీయంగా తన స్టాండ్.. టీటీడీ ఛైర్మన్ గా వేంకటేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాన్ని కల్పించాలి.. ప్రశాంతంగా దేవదేవుని దర్శనం చేసుకుని  భక్తులు ఆనందపరవశులు కావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనీ అనుకుంటున్నారు.. ఇలా తన మనసులోని భావాలను మహా న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మహా వంశీతో పంచుకున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. 

ఇది కూడా చదవండి : అమ్మ చూపిన మార్గం : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు 

మహావంశీతో బీఆర్ నాయుడు మాట్లాడుతూ దాదాపుగా 30 గంటలపాటు భక్తి పేరుతో ఒక చోట బంధించి ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘనే అని భావిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు కొద్దిగా భక్తుల కోసం ఆహారం.. నీరు దొరుకుతున్నాయి. కానీ, కొంతకాలం క్రితం అది కూడా సరిగా ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితిలో భక్తులు ప్రశాంతంగా ఎలా దేవుని దర్శించుకోగలుగుతారు అన్న బీఆర్ నాయుడు ఆ విధానం మార్చడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తమ ప్రాధాన్యత కచ్చితంగా భక్తులకు ప్రశాంతంగా దేవదేవుని దర్శనం కల్పించడమే అని స్పష్టం చేశారు టీటీడీ ఛైర్మన్. 

ALSO READ  Hydra: హైడ్రా కు తెలంగాణ సర్కార్ భారీగా నిధులు

మహా వంశీతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను పూర్తిగా ఈ క్రింది వీడియోలో చూడండి. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *