mahaa bhakthi

గోవిందా..గోవిందా..తనికెళ్ళ భరణి పిట్టకథ నవ్వుకున్న బాబు

అనగనగా ఒక ఊరు .  అక్కడో పెద్దాయన .  కష్టపడి బంగారం ఉంగరం నవరత్నాలలో చేయించుకున్నాడు .  దానిని వెలికి పెట్టుకున్నాడు .  అయితే ,  ఆ ఉంగరం కొద్దిగా చిన్నది అయింది .  అయినా ఏదోలా వెలికి ఎక్కించుకున్నాడు .  తరువాత అది బిగిసిపోయింది .  దానిని తీద్దామని ప్రయత్నించాడు .  వెలికి సబ్బు రాశాడు అయినా రాలేదు . . అల రాత్రి చాలా సేపు ప్రయత్నించి అలసిపోయి నిద్ర పోయాడు .  ఉదయం నిద్ర లేచేసరికి వేలు వాచిపోయింది .  దీంతో వెంటనే కంసాలి దగ్గరకు వెళ్ళాడు . . ఉంగరం తీయమని అడిగాడు .  ఆ కంసాలి చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇక చాలా కష్టం.. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ కి చూపించమని చెప్పాడు .  అయితే ,  ఆ పెద్దాయనకు వెంకటేశ్వర స్వామి అంటే మహా భక్తి .  దీంతో అతను వేంకటేశుని ప్రార్ధించారు .  గోవిందునికి మొక్కుకున్నాడు .  స్వామీ ఉంగరం వచ్చేస్తే నీ కొండకు వచ్చి ఆ ఉంగరం నీ హుండీలో వేస్తాను అని మొక్కుకున్నాడు .  మరి ఆపద మొక్కుల వాడు కదా . . భక్తుడి కోరికలు తీర్చే భక్తవత్సలుడు కూడాను . . వెంటనే ఉంగరం ఊడి వచ్చేలా చేశాడు గోవిందుడు .

చూశావా . . వేంకటేశుడు మొక్కితే ఎలా మన బాధలు తీరుస్తాడో అంటూ ఆ పెద్దాయన తన భార్యకు చెప్పి . . పద తిరుపతి అని బయలుదేర దీశాడు .  వాళ్లిద్దరూ దారిలో ఉండగా బంగారం ఖరీదు 100 రేట్లు పెరిగినట్టు వార్తలు  వచ్చాయి .  దీంతో భార్యాభర్తలు ఇద్దరూ . . అయ్యో . . దేవుడికి మనం ఇస్తామన్నది తక్కువ రేటు ఉన్నపుడు కదా . . అందుకని అప్పటి ఉంగరం ఖరీదు డబ్బు హుండీలో వేద్దామని అనుకున్నారు .  అదే దేవుడికి కూడా చెప్పేశారు .  హుండీ దగ్గరకు వచ్చి ఆ బంగారం అప్పటి ఖరీదు ఇంతే స్వామీ అది హుండీలో వేసేస్తున్నా అని చెప్పుకున్నారు .  విష్ణువు నవ్వుకున్నాడు .  ఆ పెద్దాయన హుండీలో డబ్బులు వేశాడు .  దాంతో పాటుగా ఉంగరం జారీ హుండీలో పడిపోయింది .

అదీ సంగతి . . దేవుడితో గేమ్స్ అదీ వడ్డీకాసులవాడితో ఆడితే . . ఇలానే ఉంటుంది .  వడ్డీతో సహా వసూలు అయిపోతుంది .

ప్రముఖ సినీనటుడు . . రచయిత తనికెళ్ల భరణి శివోహం కార్యక్రమంలో చెప్పిన పిట్టా కథ ఇది .  ఇది విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు .  ఆహూతులంతా గోవిందా . . గోవిందా అనుకున్నారు .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *