Magic: తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ వస్తున్నాడు స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోల ఫ్యాన్స్ పట్టుబట్ట మరీ తనని కంపోజర్ గా పెట్టుకోమని వత్తిడి చేసే స్థాయికి ఎదిగిన అనిరుథ్ దక్షిణాదిలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ ‘దేవర’కు చక్కటి అవుట్ పుట్ ఇచ్చిన అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో ‘మ్యాజిక్, విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి సినిమా, నాని – శ్రీకాంత్ ఓదెల చిత్రం’, తమిళంలో ‘కూలీ, విడా ముయర్చి, లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ’ సినిమాలు, హిందీలో షారూఖ్ ‘కింగ్’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Pushpa 2: పుష్ప -2పై సరికొత్త వివాదం
Magic: ఇవి కాకుండా మరో ఐదారు ప్రాజెక్ట్ లను ఒప్పుకోవలసి ఉంది. అయితే ఇన్ని సినిమాలతో బిజీబిజీగా ఉన్న అనిరుధ్ కారణంగా గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ బాగా డిలే అవుతోందట. డిసెంబర్ 21న రిలీజ్ కావలసిన ఈ సినిమా అనిరుధ్ కారణంగా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వారితో సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా యూత్ ఫెల్ మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. తన మ్యూజిక్ తో గట్టెక్కిస్తాడని భావించి ఎంపిక చేసుకున్న మ్యూజిక్ డైరెక్టరే ‘మ్యాజిక్’ చేయకుంటే ఎలా అంటున్నారు. మరి ఇప్పటికైనా అనిరుధ్ తన మ్యూజిక్ తో ‘మ్యాజిక్’ చేసి అనుకున్న తేదీకి రిలీజ్ అయ్యేలా చూస్తాడేమో!