LYF teaser: శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించిన సినిమా ‘ఎల్.వై.ఎఫ్.’. పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి దీనిని నిర్మించారు. ఎస్.పి. చరణ్, ప్రవీణ్, భద్రం, రవిబాబు, ‘షకలక’ శంకర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్ ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. తక్కువ బడ్జెట్ తో కంటెంట్ ప్రధానంగా రూపుదిద్దుకున్న చిత్రాలకు సైతం ఆదరణ లభిస్తుందని, అధిక మొత్తంతో సినిమాలు నిర్మించి, టిక్కెట్ రేట్లు పెంచమని అడగడం భావ్యం కాదని ఆయన అన్నారు. ఈ ‘ఎల్ వై ఎఫ్’ మూవీ తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమని, ఇలాంటి వాటిని సినిమాటోగ్రఫీ మంత్రిగా తాను ప్రోత్సహిస్తానని అన్నారు.

