Road Accident: నెల్లూరు జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చింతారెడ్డిపాలెం సర్కిల్ వద్ద అతివేగంగా వస్తున్న ఓ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటన వివరాలు
నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డిపాలెం సర్కిల్. అతివేగంగా వస్తున్న చేపల లోడు లారీ అదుపు తప్పింది. లారీ రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల షాపులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు.. ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తాం
లారీ బీభత్సం సృష్టించిన దృశ్యం స్థానికులను, అటుగా వెళ్లే వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేదా సాంకేతిక లోపం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

