Lok Adalat: రాజీమార్గమే రాజమార్గం.. అని పోలీస్, న్యాయ శాఖ అధికారులు కక్షిదారులకు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. రాజీపడటానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని చెప్తున్నారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన అవకాశం అని సూచిస్తున్నారు.
Lok Adalat: అనసవర గొడవలు, పట్టింపులకు పోయి జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకోవద్దని పోలీస్, న్యాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీ పడేందుకు ఈ జాతీయ లోక్ అదాలత్ ఒక సదవకాశమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా జారవిడుచుకోవద్దని వారు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.
Lok Adalat: కానిస్టేబుల్ స్థాయి నుంచి అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీస్, న్యాయ శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువల కేసులు రాజీ పడేలా ఎవరికి వారుగా చొరవ తీసుకోవాలని చెప్తున్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం దొరుకుతుందని కక్షిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.