Local Elections: తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఇప్పటిదాకా బీసీ రిజర్వేషన్ల అంశంపై నిలిచిన ఎన్నికలు ఇక వరుసగా నిర్వహించే అవకాశం ఉన్నది. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిలను నిర్వహించి, ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నిల నిర్వహణకు సర్కార్ మొగ్గు చూపిందని తెలిసింది.
Local Elections: బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఇటీవలే ఆమోదించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదించే అవకాశం ఉన్నది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. దీంతో ఇప్పటికే ముగిసిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యే పనిలో ప్రభుత్వం ఉన్నది.
Local Elections: ఈ నేపథ్యంలో వచ్చే జూలై నెలలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాక, ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్దం కానున్నది. ఇలా వరుసగా మూడు రకాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏదైనా అనుకోని సంఘటన, కోడ్ కానీ వస్తే తప్ప నూరుశాతం జూన్ నెలలోనే ఎన్నికలు జరుగుతాయని అధికార వర్గాలు కూడా తేల్చి చెప్తున్నాయి.

