Local Body Elections:ఎట్టకేలకు స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులకు సంకేతాలను ఇచ్చింది. జూన్ నెలలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ దశలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రం అమలు చేయకుంటే ప్లాన్-బి అమలు చేసి ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు అమలు చేసేందుకే సర్కారు మొగ్గు చూపినట్టు సమాచారం. దీంతో అన్నిరకాల స్థానిక ఎన్నిలు జూన్ నెలలోనే నిర్వహించే అవకాశం మెండుగా ఉన్నది.
Local Body Elections:ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు చాలా ఆలస్యం జరిగింది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయి 15 నెలలు అవుతుండగా, పరిషత్, మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాది కావస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో పడిపోయాయి. ఎక్కడికక్కడ సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికలను త్వరగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.
Local Body Elections:ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి ఆ తర్వాత 45 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉభయ సభవు ఆమోదించాయి. వాటిని రాజ్యంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నది. అఖిలపక్షంతో వెళ్లి ఢిల్లీలో పోరాడాలని ప్లాన్ చేస్తున్నది.
Local Body Elections:స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్నది. ఈ మేరకు రెండు ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఒకటి కేంద్రం నుంచి అమలు పొందడం ఒకటి. రెండోది నేరుగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి ఎన్నికలకు వెళ్లడం. దీనిపై అభ్యంతరాలు వస్తే న్యాయపరంగా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నది. కోర్టుల నుంచి ఏదైనా సమస్య వస్తే సుప్రీంకోర్టుదాకా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నది. ఇది కూడా వర్కవుట్ కాకుంటే.. పార్టీ పరంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు సిద్ధం చేయాలని భావిస్తున్నది.