Local Body Elections: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పటికే ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకైనా సిద్ధంగా ఉండేందుకు కసరత్తును పూర్తిచేసింది. తాజాగా పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాల సవరణ, తుది జాబితా ప్రచుణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ సంకేతాలకు సెప్టెంబర్ తొలి వారంలోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
Local Body Elections: ఆగస్టు 29న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనే స్థానిక ఎన్నికల విషయమై చర్చిస్తారని భావిస్తున్నారు. ఇదే సమావేశంలో ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తున్నది. ఇదే సమావేశంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపైనా చర్చ జరుగుతుందని సమాచారం. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద, దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
Local Body Elections: దీంతో రాష్ట్రపతి, గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల కాలపరిమితి, న్యాయ అంశాల ఆధారంగా దీర్ఘకాలం పట్టే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. ఇదే సమయంలో సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల గడువు సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలోనే ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేస్తున్నది.
Local Body Elections: రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు తుది జాబితాను సెప్టెంబర్ 2న విడుదల చేస్తుంది. ఎంపీటీసీ బూత్‌ల వారీగా, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓజరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. తుది జాబితా వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Local Body Elections: స్థానిక ఎన్నికల్లో భాగంగా తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే గ్రామ పంచాయతీ ఎన్నిలను నిర్వహించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం నెలరోజులకు పైగా పడుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నది.
Local Body Elections: రాష్ట్రంలో 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు, 31 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. వీటికి తొలి దశలోనే ఎన్నికలు జరుగుతాయి. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు ఉన్నాయి. ఆయా పంచాయతీలకు మలి దశలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసి ఉంచారు.
Local Body Elections: రిజర్వేషన్లను చట్టపరంగా కాకుండా, పార్టీ పరంగా ఇచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది. అందుకే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాల అనంతరం ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. దీంతో రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే, దాని ప్రకారం ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు.

