Local Body Elections 2025:

Local Body Elections 2025: బీసీ రిజర్వేషన్ల జీవో నిలిచేనా? తెలంగాణ‌లో అస‌లు స్థానిక ఎన్నిక‌లు జ‌రిగేనా?

Local Body Elections 2025:తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల హ‌డావుడి నెల‌కొన్న‌ది. ఎన్నిక‌ల ఏర్పాట్ల‌లో అధికార యంత్రాంగం నిమమ్న‌మై ఉన్న‌ది. ఈ ద‌శ‌లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్ల అమ‌లుకు జీవో తేవాల‌ని స‌ర్కారు భావిస్తున్న‌ది. ఇది న్యాయ సమీక్షకు నిలబడుతుందా? నిల‌బ‌డ‌ద‌ని తెలిసి కూడా స‌ర్కారు ప్రత్యేక జీవో ఇస్తానంటోందా? స్థానిక సంస్థల ఎన్నికలను మరికొన్నాళ్లపాటు వాయిదా వేసే వ్యూహమా? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Local Body Elections 2025:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ సర్కారు.. చట్టబద్ధంగా అది సాధ్యం కాదని తేలిపోవడంతో మ‌రో అంకానికి తెరతీసింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించడంలేదని, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్తూ, తామే ప్రత్యేక జీవో జారీ చేసి 42 శాతం బీసీ రిజ‌ర్వేష‌న్లు కల్పిస్తామని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రకటించింది. త్వ‌ర‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామంటూ హంగామా సృష్టిస్తోంది.

Local Body Elections 2025:కానీ, జీవోతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయి. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. దీంతో రేవంత్ సర్కారు ఇచ్చే జీవోపై ఎవరైనా కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే కోర్టు ఈ జీవోను నిలిపివేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి రావచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విషయాలు తెలిసే జీవో ఇవ్వాలనుకోవడం బీసీలను మభ్యపెట్టడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Local Body Elections 2025:ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకే రిజర్వేషన్లపై జీవో తెస్తామంటూ హడావిడి చేస్తోందని ప్ర‌తిప‌క్ష‌పార్టీలు, బీసీ సంఘాల నేత‌లు అంటున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఏ పథకమూ సక్రమంగా అమలు కావ‌డం లేద‌ని కూడా వారు పేర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం కాంగ్రెస్ సర్కారును ఇరకాటంలోకి నెట్టింది. ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లడం, సుప్రీం ఆదేశాలతో ఆ ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ విచారణ చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది.

Local Body Elections 2025:తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దుస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. చివరికి ఆ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనేలేదని ప్రకటించేసింది. ఎమ్మెల్యేలకు తాము కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, జాతీయ జెండాలోని మూడు రంగులు ఉన్న కండువా అని వారితో చెప్పించడంతోపాటు సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రిని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలుస్తారని, వారికి మర్యాదపూర్వకంగా కండువా కప్పుతుంటామని, అంతమాత్రాన పార్టీ మారినట్లు అవుతుందా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

Local Body Elections 2025:చివరికి ఆయా ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని స్థితిని ఎదుర్కొంటున్నారు. కడియం శ్రీహరి వంటి సీనియర్ నేత కూడా తాను ఏ పార్టీయో స్పీకరే తేలుస్తారని అనడం వారి పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల్లో పలుచన అవుతున్న పరిణామాలు మొదలయ్యాయి.

Local Body Elections 2025:సర్కారుపై కొన్నివ‌ర్గాల్లో ఉన్న వ్యతిరేకత నుంచి పక్కదారి పట్టించేందుకే స్థానిక ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనే అంశాన్ని ముందుకు తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి తీసుకొచ్చే జీవోను కోర్టు ఎలాగూ కొట్టేసే అవకాశం ఉన్నందున.. ఆ విషయాన్ని చెప్పి ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరవచ్చని సర్కారు భావిస్తోందని అంటున్నారు.

Local Body Elections 2025:అనంతరం సమయానుకూలత చూసుకొని ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్లకు వీలు కుదరదని, దాంతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని చెప్పవచ్చని భావిస్తోంది. కానీ, చివరికి గెలుపు గుర్రాల పేరిట మళ్లీ బీసీలకు మొండి చెయ్యే చూపిస్తారనే అభిప్రాయం బీసీ వర్గాల్లో ఉంది. నిజాయితీగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలితితేనే కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు చిత్తశుద్ధితో కూడినవని నమ్మే అవకాశం ఉంటుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *