Zeenat Aman: తొలుత కొన్ని చిత్రాలలో నటించినా దేవానంద్ ‘హరే రామ హరే కృష్ణ’తో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది జీనత్ అమన్. ఆ తరువాత జీనత్ తన అందచందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సాగారు. జీనత్ తమ చిత్రంలో నటిస్తే చాలు అనుకొని ఆమె కాల్ షీట్స్ ఎంత కాస్ల్లీగా మార్చినా, అంత మొత్తం ఇచ్చి మరీ నిర్మాతలు సినిమాలు నిర్మించారు. అదే తీరున జీనత్ నటించిన అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నవంబర్ 19న జీనత్ అమన్ పుట్టినరోజు. ఇప్పుడంటే ఏడు పదులు దాటిన వయసు కాబట్టి ముసలమ్మ అంటున్నారు కానీ, ఆ నాటి అభిమానులకు జీనత్ ఈ నాటికీ శృంగార రసాధిదేవత అనే చెప్పవచ్చు. అందువల్ల జీనత్ పుట్టినరోజున ఫ్యాన్స్ ఆమె పాత చిత్రాలు చూసి ఆనందిస్తారని భావించవచ్చు.

