Lawrence Bishnoi

Lawrence Bishnoi: సినిమాని మించిన లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ స్టోరీ! విద్యార్థి నాయకుడి నుండి నేరస్థుడిగా ప్రస్థానం.. 

Lawrence Bishnoi: ప్రస్తుతం మన దేశంలో ప్రముఖంగా వినిపిస్తున్న క్రిమినల్ పేరు లారెన్స్ బిష్ణోయ్. ఇటీవల సినీనటుడు సల్మాన్ ఖాన్ సన్నిహితునిగా చెప్పుకునే.. ముంబైలో ఎన్‌సిపి నాయకుడు.. మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిజానికి ప్రస్తుతం లారెన్స్ గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. సల్మాన్‌ఖాన్‌, దావూద్‌ గ్యాంగ్‌కి సహాయం చేసే వారు జాగ్రత్తగా ఉండాలని లారెన్స్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బాబా సిద్ధిఖీని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ హత్యకు పాల్పడడం ఇదే మొదటిసారి కాదు.  ఇంతకు ముందు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా, కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురయ్యారు. ఈ హత్యల వెనుక కూడా బిష్ణోయ్ గ్యాంగ్  ఉందని చెబుతారు. అతని గ్యాంగ్‌లో దేశ విదేశాల్లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నట్లు సమాచారం. అసలు ఎవరీ లారెన్స్ బిష్ణోయ్? క్రిమినల్ గా ఎందుకు మారాడు? జైలులో ఉన్నాసరే అతని ఆట బయట ఎలా సాగుతోంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 

32 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్‌లోని ఫజిల్కా నివాసి. సంపన్న రైతు కుటుంబంలో జన్మించిన లారెన్స్ బిష్ణోయ్ చదువుల కోసం 2010లో చండీగఢ్ వచ్చాడు.  కాలేజీలో అతని జీవితం ఎంతగా మారిపోయాడు అంటే..  ఇప్పుడు అతను నిజ జీవితంలో క్రైమ్ ప్రపంచానికి యానిమల్ గా మారిపోయాడు.  లారెన్స్ బిష్ణోయ్ కథ ఇదే.. 

32 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) పంజాబ్‌లోని ధాతరన్‌వాలి గ్రామంలో నివాసి. 12వ తరగతి వరకు అబోహర్‌లో చదివాడు. ఆ తర్వాత కాలేజీ కోసం 2010లో చండీగఢ్ వెళ్లాడు. ఆ సమయంలో అతను డిఎవి కాలేజీ, సెక్టార్ 10లో చదివాడు. 2011-2 మధ్య పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (SOPU) అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 

లారెన్స్ బిష్ణోయ్‌పై మొదటి ఎఫ్‌ఐఆర్ హత్యాయత్నం రికార్డ్ అయింది. ఆ తర్వాత ఆక్రమణలపై 2010 ఏప్రిల్‌లో మరో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. 2011 ఫిబ్రవరిలో బిష్ణోయ్‌పై దాడి చేసి సెల్‌ఫోన్ దోచుకున్న కేసు నమోదైంది. ఈ మూడు కేసులూ విద్యార్థి రాజకీయాలకు సంబంధించినవే కావడం గమనార్హం. అంటే, విద్యార్థి రాజకీయాల నుంచి ఇతని జీవితం క్రైమ్ వైపు మలుపు తిరిగింది. విద్యార్థి రాజకీయాల ద్వారా నేర ప్రపంచంలో చేరాడు. చండీగఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలో లారెన్స్ బిష్ణోయ్‌పై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నాలుగు ఎఫ్‌ఐఆర్‌లలో నిర్దోషిగా విడుదల కాగా, మూడింటిలో కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఇది కూడా చదవండి :  Mumbai: రూ. 5 కోట్లు ఇవ్వాలి.. లేకపోతే అంతే.. స‌ల్మాన్ ఖాన్ కు వార్నింగ్…

బిష్ణోయి(Lawrence Bishnoi)ని రెండుసార్లు విచారించిన ఒక పోలీసు అధికారి 2022లో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ ఇంటర్వ్యూలో  లారెన్స్ ఎప్పుడూ తనకంటే సీనియర్లతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించే వాడు. వారితోనే కల్సి తిరిగేవాడు. ఏదైనా పెద్ద పని చేసి సందడి చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు అని చెప్పారు. 2015లో, లారెన్స్ బిష్ణోయ్ మొహాలి సమీపంలో పోలీసు కస్టడీ నుండి తప్పించుకోగలిగాడు, కాని వెంటనే అరెస్టు అయ్యాడు. 

లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) బీఏ మొదటి సంవత్సరం కూడా పాస్ కాలేదు. 2010లో పరీక్షల సమయంలో చిట్టీలతో కాపీ కొట్టి పట్టుబడ్డాడు. పరీక్ష సూపరింటెండెంట్‌కు అప్పగించబోతుండగా, అతను తన ఆన్సర్ షీట్‌తో మొదటి అంతస్తు కిటికీలోంచి దూకాడు. అలా క్రైమ్‌ వరల్డ్‌లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మళ్లీ పరీక్ష రాయాలని అనుకున్నాడు. ఈసారి చేతికి సంకెళ్లు వేసి పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. లారెన్స్ బీఏ పార్ట్-1లో రెండు సార్లు ఉత్తీర్ణత సాధించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.

క్రైమ్ ప్రపంచంలో ఎదిగాడు ఇలా.. 

లారెన్స్ బిష్ణోయ్ కాలేజీ రోజుల్లో కొంతమంది అల్లరి పిల్లలు.. పోలీసులను కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ఆ దశలో నేర ప్రపంచంలోకి అతని ప్రవేశం ఫాజిల్కా గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త జస్విందర్ సింగ్ అలియాస్ రాకీ ద్వారా ఈజీగా జరిగింది. విద్యార్థి రాజకీయాల ముసుగులో రాజస్థాన్‌లో, ముఖ్యంగా శ్రీగంగానగర్ భరత్‌పూర్‌లో తన స్నేహితులతో కలిసి ఉండడం చేసేవాడు. మే 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని పర్వానూ సమీపంలో రాకీ హత్యకు గురయ్యాడు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ జైపాల్ భుల్లర్ ఈ హత్య వెనుక ఉన్నట్టు తేలింది. దానికి ప్రతీకారంగా లారెన్స్ 2020లో భుల్లర్‌ను హత్య చేశాడు. 2021లో, లారెన్స్ బిష్ణోయ్‌ను రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నుండి ఢిల్లీలోని తీహార్ జైలుకు MCOCA కింద నమోదైన కేసు విచారణ కోసం తరలించారు.  

సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసుతో వెలుగులోకి.. 

లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) సన్నిహితుడు సంపత్ నెహ్రాను పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. అప్పుడు మొదటిసారిగా లారెన్స్ బిష్ణోయ్ పేరు జాతీయస్థాయిలో వెలుగులోకి వచ్చింది. లారెన్స్ సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసి.. అతని కదలికలను తెలుసుకోవడానికి సంపత్ ను వినియోగించాడు. ఆ విషయం పోలీసులకు సంపత్ వెల్లడించాడు. లారెన్స్ బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన వాడు. రాజస్థాన్ లో బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు చాలా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరు కృష్ణ జింకలని పరమ పవిత్రంగా భావిస్తారు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడు అని తెల్సిన లారెన్స్ బిష్ణోయ్ అతన్ని టార్గెట్ చేసుకున్నాడు. 

లారెన్స్ బిష్ణోయ్‌పై హత్య, హత్యాయత్నం, దోపిడీ మొదలైన రెండు డజన్లకు పైగా కేసులు ఉన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ కు చెందిన  క్రైమ్ సిండికేట్ మే 2022లో పంజాబీ కళాకారుడు సిద్ధూ మూసేవాలా హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ కాల్పులకు బాధ్యత వహించాడు, అయితే ఇందులో బిష్ణోయ్ క్రియాశీల ప్రమేయం అనుమానంగానే మిగిలింది. 

లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) అంత శక్తిమంతుడు ఎలా అయ్యాడు… 

కటకటాల వెనుక ఉన్నప్పటికీ, లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్‌లో బలమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. అతను పెద్ద నేరగాళ్ల నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడని వివిధ ఏజెన్సీలు ఆరోపించాయి. ఆయనకు రాజకీయ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ నెట్‌వర్క్ నేర సంస్థ భారతదేశం అంతటా విస్తరించి దాని చెబుతారు.  ఇందులో దాదాపు 700 మంది సభ్యులున్నారని సెంట్రల్ ఏజెన్సీలు అంటున్నాయి. 

లారెన్స్ కెనడా, ఇతర దేశాలలో ఉంటున్న పంజాబ్‌ కు చెందిన చాలామంది ఇతర గ్యాంగ్‌స్టర్‌లతో టచ్‌లో ఉన్నాడు. ఒక విధంగా, లారెన్స్ స్థానిక గ్యాంగ్‌స్టర్‌ల సహకారంతో గ్లోబల్ క్రిమినల్ నెట్‌వర్క్‌ను సృష్టించాడని చెబుతారు. ఖలిస్తాన్ ఉద్యమం, వివిధ రకాల దేశ వ్యతిరేక కార్యకలాపాలను బిష్ణోయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అతను షహీద్ భగత్ సింగ్, గురు జంభేశ్వర్, హనుమంతుడిని నమ్ముతాడు

జైలు లోపల నుంచే ముఠా విస్తరణ.. 

లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) పై చాలా కేసులు నమోదు అయ్యాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నిజానికి  జైలుకు వెళ్లడం లారెన్స్ బిష్ణోయ్‌కు లాభదాయకమైన విషయంగా మారింది. జైలు బయట నుంచి చేయలేని పనిని జైలునుంచి అతను చేయగలిగాడు. నిజానికి జైలు లోపలికి వెళ్లిన తర్వాత చాలా మంది గ్యాంగ్‌స్టర్లతో పరిచయం ఏర్పడి వారితో కలిసి పని చేస్తూ తన గ్యాంగ్‌ను విస్తరించాడు. ఈ సమయంలో ఆయుధ వ్యాపారులతోనూ పరిచయం ఏర్పడింది. తన ప్రాభవాన్ని చాటుకునేందుకు లూథియానాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని కాల్చి చంపినట్లు ప్రచారం జరిగింది.  2014లో రాజస్థాన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.  

కర్ణి సేన అధ్యక్షుడి హత్య 

లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) ఇప్పుడు క్రైమ్ ప్రపంచానికి రారాజుగా మారే మార్గంలో ఉన్నాడు. ఆయన ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. గతేడాది డిసెంబర్‌లో కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని జైపూర్‌లో కాల్చి చంపి, దానికి బాధ్యత వహించాడు. ఈ సంఘటన జరిగిన 10 నెలల తర్వాత, సల్మాన్ ఖాన్ సన్నిహితుడు – మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ముంబైలోని అతని కొడుకు కార్యాలయం వెలుపల హత్య చేయబడ్డాడు. ఈ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ ముంబైలో కూడా తన మూలాలను బలపరుచుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దావూద్ గ్యాంగ్ ఇక్కడ చురుకుగా ఉంది. బిష్ణోయ్ గ్యాంగ్ దానిని తమ శత్రువుగా భావిస్తోంది. బాబా సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తూ పోస్ట్ చేయడం ద్వారా కూడా దీనిని అంచనా వేయవచ్చు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ క్రైమ్ సిండికేట్ ఇలా.. 

లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) ముఠా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో చురుకుగా ఉంది. ఈ ముఠా కార్యకలాపాలు ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ, సుపారీ హత్యలు అదేవిధంగా  ఇతర వ్యవస్థీకృత నేరాలకు సంబంధించినవి. బిష్ణోయ్ గ్యాంగ్ వ్యాపారవేత్తలు, బిల్డర్లు , ఇతర ప్రముఖ వ్యక్తుల నుండి దోపిడీకి ప్రసిద్ధి చెందింది. ఈ ముఠా సభ్యులు పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులను పలుమార్లు బెదిరించారు. అనేక హత్యలు, హత్యాయత్నాలలో ఈ ముఠా పేరు బయటపడింది. బిష్ణోయ్ గ్యాంగ్ కు సుపారీ హత్యలో కూడా ప్రమేయం ఉంది. పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల రవాణాలో ఈ ముఠాదే పెద్ద పాత్ర

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *