Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అర్హుల జాబితాలో పేరు లేని రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి జూలై 23, 2025 (ఈరోజు) చివరి తేదీ. మీరు అర్హులైనప్పటికీ జాబితాలో మీ పేరు లేకపోతే, ఈరోజు లోపు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు.ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి ₹20,000 ఆర్థిక సహాయం మూడు విడతల్లో అందించబడుతుంది. ఈ రూ. 20,000లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందించే రూ. 6,000 కూడా కలిసి ఉంటుంది. మిగిలిన రూ. 14,000ను రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రైతులకు అందిస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
తొలి విడత: రూ. 7,000
రెండో విడత: రూ. 7,000
మూడో విడత: రూ. 6,000
ఈ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడుతుంది. భూమి పట్టాదారు రైతులు, అలాగే పంట సాగు చేసే అద్దె రైతులు కూడా ఈ పథకానికి అర్హులు. కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. అంటే, ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పేరు మీద భూమి ఉన్నప్పటికీ, వారిలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు (రూ. 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారు), పెద్ద భూస్వాములు ఈ పథకానికి అర్హులు కారు. జూలై నెలాఖరు లేదా ఆగస్టు 2, 2025న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు (రూ. 7,000) విడుదల చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Wedding Dates: జులై 25వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!