Nayanthara

Nayanthara: NBK111: రాణి లుక్ లో ఆకట్టుకున్న నయనతార!

Nayanthara: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.

Also Read: Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోస్ కొత్త ప్రయోగం?

NBK111 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. రాణి వచ్చేస్తోంది.. అంటూ ఈ చిత్ర హీరోయిన్‌ను పరిచయం చేసేందుకు చిత్ర యూనిట్ నిన్న అప్డేట్ ఇచ్చింది.తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ ఎవరనే విషయాన్ని రివీల్ చేసింది. అందరూ అనుకున్నట్టు గానే ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఆమె పుట్టినరోజు సందర్బంగా ఒక చిన్న గ్లింప్స్ ని వదిలారు. రాణి లుక్ లో నయనతార ఫెరోషియస్ కనిపిస్తుంది.ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *