KTR:సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనను కేటీఆర్ హైడ్రాతో పోలుస్తూ కామెంట్ చేశారు. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా గుర్తించడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR:ఘటనలో గాయపడిన వారికి న్యాయం జరగాలి, కానీ నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సరికాదని కేటీఆర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలి అని పోలీసులను కేటీఆర్ డిమాండ్ చేశారు.

