Rajampet Politics

Rajampet Politics: రాజంపేట కూటమిలో కుదరని పొత్తుల కలయిక

Rajampet Politics: అన్నమయ్య జిల్లాలో రాజంపేట కీలక నియోజకవర్గం… అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి అయినా రాజకీయం మాత్రం ఇక్కడ నుంచి జరుగుతుంది కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీ నేతలు కరువైతే రాజంపేటలో అన్ని పార్టీలకు డజన్ల కొద్దీ నేతలు పోటీలో ఉంటారు అదే రాజంపేట ప్రత్యేకత సాధారణంగా ప్రతిపక్ష పార్టీల్లో జరగాల్సిన అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు అధికార కూటమిలో కలకలం రేపుతోంది. 

ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న రాజంపేట ఇప్పుడు గెలుపు కోసం మొహం వాచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి జోరులోను రాజంపేటలో మాత్రం ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు కారణమంటున్నారు.

Rajampet Politics: రాజంపేటలో మొదటి నుంచి బత్యాల చంగల్ రాయుడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.కొంతకాలం తర్వాత రాయచోటికి చెందిన జగన్ మోహన్ రాజు రాజంపేట కేంద్రంగా టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్యాడర్ తనవైపు తిరిగేలా చేసుకున్నారట… యల్లటూరి శ్రీనివాసరాజు, అతికారి దినేష్ లాంటి నేతలు గత ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు పోటీలో నిలిచారు.

అయితే చివరి క్షణంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు రాజంపేట టికెట్ దక్కడంతో బత్యాల చంగల్ రాయుడు లాంటి నేతలు బహిరంగంగానే అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించినా మిగిలిన కూటమి నేతలు తమ అధినేతల నిర్ణయానికి కట్టుబడి ఉన్నారట…అయితే ఎన్నికల్లో కూటమి నేతలు కలిసి పనిచేయలేదనే ప్రచారం జరిగింది. అందుకే కూటమి హవాలోను రాజంపేటలో ఓటమి చవిచూసింది.

Rajampet Politics: అయితే ఎన్నికల తర్వాత కూడా కూటమి నేతల మధ్య సయోధ్య కుదరలేదట… అధికారంలో ఉండి కూడా నేతల మధ్య విభేదాల కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పోటీతో నిధులు రాకుండా అడ్డుకుంటున్నారట… ఇటీవల అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా రిబ్బన్ కటింగ్ కోసం సుగవాసి, జగన్ మోహన్ రాజు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం రాజంపేట కూటమిలో కలకలం రేపింది.

ఇద్దరు నేతల మద్య విభేదాల కారణంగా జనసేన, బీజేపీ నేతల కూడా సొంతంగా తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారట…కూటమి అధికారంలో ఉండి ప్రజలకు మంచి చేయాల్సిన నేతల తన్నులాటలు చూసీ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారట…ఇక వీల్లేం అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారంటా… మరి రాజంపేట కూటమి రగడపై తమ అధినేతలు ఎలాంటి చర్యలూ తీసుకుంటారో చూడాలి మరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *