KTR: రేవంత్ పై కేటిఆర్ భారీ విమర్శలు..

KTR: తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రమాదాన్ని పక్కన పెట్టి రాజకీయాలు

రేవంత్ రెడ్డి నిజంగా బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే, ఎస్ఎల్‌బీసీ ప్రమాదం, రెస్క్యూ ఆపరేషన్‌పై పూర్తి దృష్టి సారించి ఉండేవారని, కానీ ఆయన మాత్రం ఎన్నికలు, ఢిల్లీ పర్యటనలు అంటూ తిరుగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టి, రాజకీయ ప్రయోజనాల కోసం పరితపించడం సరికాదని మండిపడ్డారు.

“సిగ్గులేదా జీడిగింజ” – కేటీఆర్ వ్యంగ్య విమర్శ

“సిగ్గులేదా జీడిగింజ అంటే, నల్లగున్నా నాకేటి సిగ్గు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎస్ఎల్‌బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని మాజీ సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా రీల్స్ చూసే పనికి కాకుండా, కేసీఆర్ చెప్పిన విషయాలను పరిశీలించాలని హితవు పలికారు. అప్పుడైనా కొంచెం విషయ పరిజ్ఞానం వస్తుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

“పనులు ఆగిపోవడం వల్ల బేరింగులు పని చేయడం లేదనడం విడ్డూరం”

కేటీఆర్ మాట్లాడుతూ, ఎస్ఎల్‌బీసీ పనులు ఆగిపోవడం వల్ల బేరింగులు పనిచేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించే ముందు టెక్నికల్ అసెస్‌మెంట్, జీఎస్ఐ సర్వే వంటి తగిన పరిశీలనలు జరిపారా? లేక కమీషన్ల కోసం గుడ్డిగా ముందుకు వెళ్లారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం దానిపై స్పందించకుండా, పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్‌చాట్ చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ అనాసక్తి, బాధ్యతారాహిత్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *