KTR: చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌ను ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఆయనతోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వీరరాఘవ నేతృత్వంలోని రామరాజ్యం సైన్యం సభ్యులు ఇటీవల రంగరాజన్‌పై దాడి ఘటన విషయం తెలిసిన కేటీఆర్‌ను ఇప్పటికే ఫోన్‌లో పరామర్శించారు.
KTR: తాజాగా స్వయంగా కలిసి ఆయనను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాడి జరిగిన తీరుపై ఆయన ద్వారా తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేసి చర్యలు తీసుకునేదాకా తాము అండగా ఉంటామని రంగరాజన్‌కు భరోసా కల్పించారు.
ఆలయం బయట కేటీఆర్ మాట్లాడుతూ కీలక అంశాలను లేవనెత్తారు. ప్రతిష్టాత్మకమైన భక్తుల కొంగుబంగారమైన చిలుకూరు ఆలయంలో ఉండే పూజారి రంగరాజన్‌పై దాడి జరగడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు. ఈ దాడి ఎవరు చేసినా, ఏపేరుతో చేసినా ఊపేక్షించవద్దని హెచ్చరించారు.
నిత్యం దైవసేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KTR: రంగరాజన్‌పై దాడి విషయంపై ఇప్పటికే కేటీఆర్ ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ధర్మరక్షకులు దాడులు చేస్తారు. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు.. అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. చిలుకూరు ఆలయ పూజారిపై రెండు రోజుల క్రితం దాడి జరిగింది. ఈ పిరికిపందల చర్యలపై హిందూమత రక్షకుల మనే వారి నుంచి ఒక్కమాట కూడా రాలేదని పేర్కొన్నారు. రంగరాజన్‌పై దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నదా? అని ప్రశ్నించారు. ఇది ఘోర అవమానకరం. హోంమంత్రి అయిన ముఖ్యమంత్రి ఏమైనా చొరవ తీసుకున్నారా? ఎవరికైనా సమాధానాలు చెప్పారా? అంటూ ప్రశ్నించారు.

