Thandel

Thandel: భారీ వసూళ్లతో దుమ్ము దులుపుతున్న తండేల్.. 60 కోట్ల క్లబ్ లో నాగ చైతన్య!

Thandel: తండేల్ ప్రపంచవ్యాప్తంగా అదరగొడుతుంది. ఫస్ట్ డే రూ.21 కోట్లకు పైగా గ్రాస్ అందుకోగా.. రెండో రోజు రూ.20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. అలా రిలీజ్ అయిన 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌ ఏకంగా రూ.41.2 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.. ఇక మూడోరోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా మూడో రోజుకు ఏకంగా రూ.62.37 కోట్ల గ్రాస్ కు చేరుకుంది.

ALSO READ: Stock Market: రూపాయి మరింతగా పడిపోయింది.. స్టాక్ మార్కెట్ ఢమాల్ అంది..

పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదలైనప్పటికీ తెలుగులోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాతో ఇప్పటికే 60 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన నాగ చైతన్య ఇంకో రెండ్రోజుల్లో 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *