Konaseema: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. కూతురు వయసున్న 9వ తరగతి విద్యార్థినిపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కన్నేశాడు. ఎలాగైనా వశపరచ్చుకోవాలని పన్నాగం పన్నాడు. తన గదిలోకి పిలిపించుకున్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో ఆ కామాంధుడు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు.
Konaseema: కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో ఆ విద్యార్థిని 10వ తరగతి చదువుతున్నది. 9వ తరగతి చదివే సమయంలోనే ఆ విద్యార్థినిపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జయరాజు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. ఇదే అదనుగా భావించిన ఆ దుర్మార్గుడు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
Konaseema: ఆ బాధిత విద్యార్థినికి మూడు నెలలుగా పీరియడ్స్ రావడం లేదని ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యపరీక్షల్లో ఆ బాలిక గర్భవతి అయిందని వైద్యులు నిర్ధారించారు. అక్కడే ఆ బాలికను ఆమె తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు జయరాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.