Kishan Reddy: రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి కౌంటర్..

Kishan reddy: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. యూపీఏ హయాంలో దేశం ఎదుర్కొన్న వైఫల్యాలను ఎన్డీఏపై నెట్టడం రాహుల్‌ అవివేకమని ఆయన మండిపడ్డారు.

కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పాలనలో 10 సంవత్సరాల్లో ఉపాధి కేవలం 6 శాతం పెరిగింది. కానీ బీజేపీ హయాంలో అదే 36 శాతానికి చేరింది. మోదీ ప్రభుత్వ పాలనలో 4.9 కోట్లకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. వ్యవసాయ రంగంలో కాంగ్రెస్‌ హయాంలో ఉపాధి 16 శాతం తగ్గగా, మోదీ హయాంలో 19 శాతం పెరిగింది” అని వివరించారు.

అంతేకాకుండా, 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిందని, ఇది బీజేపీ ప్రభుత్వంలో తీసుకున్న అభివృద్ధి చర్యల ఫలితమని పేర్కొన్నారు. యూపీఏ పాలనలో దేశం వెనుకబడ్డప్పటికీ, మోదీ నాయకత్వంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *