Kishan reddy: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే ఏ సంస్కరణకైనా తెలంగాణ భాగస్వామిగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో 10 లక్షలకుపైగా MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) ఉన్నాయని, ఈ రంగానికి స్టార్టప్ కంపెనీలతో పాటు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
“వచ్చే ఐదేళ్లలో తెలంగాణ MSMEలకు రూ.1.50 లక్షల కోట్లు రాబోతున్నాయి. అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించబడ్డాయి. అమృత్ పథకం ద్వారా 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు లబ్ధి చేకూరనుంది” అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రత్యేకంగా మధ్య తరగతి ప్రజలకు అంకితమైనదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వంపై స్పష్టత ఇవ్వుతూ, “కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన బీజేపీకి లేదు” అని స్పష్టం చేశారు. అయితే, “ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పరిపాలనను చూశారు. తర్వాత వచ్చే ప్రభుత్వం బీజేపీదే” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.