Kiara Advani: బాలీవుడ్ ప్రముఖ జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హత్రా తమ అభిమానులకు సంతోషకరమైన వార్తను ప్రకటించారు. త్వరలోనే తల్లిదండ్రులుగా మారనున్న ఈ దంపతులు, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పాప సాక్స్ ఫోటోను షేర్ చేస్తూ, “మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలోనే రానుంది” అంటూ హృదయపూర్వక సందేశాన్ని పోస్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: Kingston: మార్చి 7న తెలుగులో జీవీ ప్రకాష్ ‘కింగ్స్టన్’ రిలీజ్!
Kiara Advani: గతంలో కియారా అనారోగ్య సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరిగినప్పటికీ, అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇక ఇప్పుడు, ఈ శుభవార్తతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
కియారా, సిద్ధార్థ్ 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ‘షేర్షా’ సినిమా సెట్స్‌లో ప్రేమలో పడిన ఈ జంట, రెండేళ్ల పెళ్లయిన తర్వాత తమ కుటుంబంలో కొత్త అతిథి రాబోతున్నట్లు ప్రకటించడం హర్షణీయంగా మారింది.