Supreme Court: రోహింగ్యా పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ప్రవేశం కల్పించకపోతే, వారు హైకోర్టుకు వెళ్లవచ్చు. UNHRC కార్డులు కలిగి ఉన్న శరణార్థ రోహింగ్యా పిల్లల కోసం కోర్టు ఈ ఉత్తర్వు ఇచ్చింది.
ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. రోహింగ్యా హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అనే ఎన్జీఓ పిటిషన్‌పై ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
రోహింగ్యా శరణార్థులకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల వారు ఈ సౌకర్యాలను పొందలేకపోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారు శరణార్థులు, వారికి ఆధార్ కార్డులు ఉండవు. వారికి UNHRC కార్డులు ఉన్నాయి.
ఫిబ్రవరి 12న ఇలాంటి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇదేరకమైన ఆదేశాలనే ఇచ్చింది. అప్పుడు కోర్టు
ఏ బిడ్డకూ విద్య విషయంలో వివక్ష చూపబోమని చెప్పింది.
ఇది కూడా చదవండి: Uttarakhand Avalanche: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మంచు కొండ, 47 మంది గల్లంతు
నగరంలోని రోహింగ్యా శరణార్థులకు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులలో ప్రవేశం కల్పించాలని కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరింది.
అక్రమ బంగ్లాదేశీయులు,, రోహింగ్యాలు భారతదేశంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తున్న నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఢిల్లీలో శాంతిభద్రతలపై జరిగిన సమీక్షా సమావేశంలో అమిత్ షా ఈ ఆదేశాలు జారీ చేశారు.
బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశించడానికి, వారి పత్రాలను తయారు చేసుకోవడానికి.. ఇక్కడే ఉండటానికి సహాయపడే మొత్తం నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఆయన అన్నారు. అక్రమ చొరబాటుదారుల సమస్య జాతీయ భద్రతతో ముడిపడి ఉంది. దీనిపై కఠినంగా వ్యవహరించాలి.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఢిల్లీ హోం మంత్రి ఆశిష్ సూద్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా సహా పలువురు సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.