Khammam: ఖమ్మం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీరంగం సృష్టించాడు. రౌడీలెక్క ప్రవర్తించాడు. ఫక్తు రాజకీయ నాయకుడిలా దౌర్జన్యానికి దిగాడు. ఓ దుకాణంలోకి చొరబడి అరాచకానికి దిగాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయి బయటకు రావడంతో కలకలం రేగింది. ఓ పోలీస్ అధికారికి చేసిన ఆడియో రికార్డు బయటకు పొక్కడంతో ఆయన బాగోతం బయటి ప్రపంచానికి తెలిసింది.
Khammam: ఖమ్మంలో ఇటీవల పటాకుల దుకాణాలు నెలకొన్నాయి. వాటిలో నేలకొండపల్లి మండలంలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసే ఓ ఉపాధ్యాయుడు కూడా ఒక దుకాణం పెట్టాడు. అక్కడే అదే జిల్లాలోని పాల్వంచ నుంచి వచ్చిన ఓ యువకుడు కూడా పటాకుల దుకాణం పెట్టాడు. ఏకంగా ఆ పాల్వంచ యువకుడి దుకాణానికి వెళ్లి దౌర్జన్యం ప్రదర్శించాడు. తీవ్రమైన దుర్భాషలాడాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ షాపు పెట్టడానికి నువ్వెవడ్రా అంటూ హెచ్చరికలు జారీచేశాడు.
Khammam: షాపును వెంటనే తొలగించాలని, లేకుంటే తన మనషులను పంపి షాపును లేపిస్తానని ఆ ఉపాధ్యాయుడు హెచ్చరించాడు. తనకు మంత్రుల అండ ఉన్నదని దబాయించాడు. ఇదే విషయమై ఓ పోలీస్ అధికారికి ఫోన్ చేసి ఎస్ఐని, ఇతర పోలీస్ సిబ్బందిని పంపి దుకాణాన్ని తొలగించాలని హెచ్చరికలు జారీచేశాడు. పోలీస్ అధికారితో మాట్లాడేటప్పుడు కూడా పాల్వంచ యువకుడిని తీవ్ర దుర్భాషలాడాడు.