Kerala: భారతీయ వంటకాలలో దక్షిణాది వంటకాలకే ప్రత్యేకత ఉన్నది. తమిళనాడు, కేరళ వంటకాలంటే కొందరు చెవులు కోసుకుంటారు. ఈ వంటకాలే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించడం మరీ విశేషం. అలాంటి కేరళలో తాజాగా ఓనం పర్వదినం సందర్భంగా తయారు చేసిన ఓ వంటకం ప్రత్యేకతను చాటుకున్నది. ఆ వంటకానికి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
Kerala: కేరళలో ఓనం పండుగను పురస్కరించుకొని ఓ కాలేజీ విద్యార్థులు ఓనం సాద్య అనే వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ వంటకాన్ని 204 మంది విద్యార్థులు, 11 మంది కళాశాల అధ్యాపకులు కలిసి తయారు చేశారు. 399 రకాల వంటకాలను తయారు చేసి దానికి ఓనం సాద్య అనే పేరు పెట్టారు. పలు రకాల వెరైటీలు తయారు చేయడం విశేషం.
Kerala: ఈ ఓనం సాద్య ప్రత్యేక వంటకంలో 83 రకాల తోరన్ (కొబ్బరితో తయారు చేసిన ఆహార పదార్థాలు) 64 రకాల స్వీట్లు, 58 రకాల చమ్మతి, 57 రకాల పచ్చళ్లు, 56 రకాల పాయసాలు, 19 రకాల ఫ్రైడ్ వెజిటబుల్స్, నెయ్యి, సాల్ట్, సీడ్స్‌తో తయారు చేసిన వంటకాలు ఉన్నాయి. ఓనం సాద్య అనే వంటకాన్ని ఓ పండుగలా తయారు చేశామని విద్యార్థులు, అధ్యాపకులు చెప్పారు.