CM Vijayan: కేరళ సీఎం పినరయి విజయన్‌కు బుధవారం తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. ఆ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని వామనాపురంలో సీఎం కాన్వాయ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఓ స్కూటర్ డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపు తిరగడంతో వెనుక నుంచి వస్తున్న సీఎం కాన్వాయ్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఒకదానికి ఒకటి చొప్పున వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదు ఎస్కార్ట్ వాహనాలు దెబ్బతిన్నాయి.
CM Vijayan: రోడ్డు ప్రమాదంలో సీఎం విజయన్‌కు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆయన తిరువనంతపురం జిల్లాలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. సీఎంతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకూ ఎలంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. అదే రోడ్డుపై వెనుక వైపు నుంచి భారీ వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.