Bandhavgarh Tiger Reserve: ఉమారియాలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో నాలుగు అడవి ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. అదేవిధంగా మరో నాలుగు ఏనుగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఖితౌలీ పరిధిలోని సల్ఖానియా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న టైగర్ రిజర్వ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఏనుగులు ఏదైనా విషపూరితమైన పదార్థాన్ని తిన్నాయా లేదా ఎవరైనా తినిపించి ఉండవచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఎంత మంది ఉన్నారంటే
కొన్ని రోజులుగా 13 ఏనుగుల గుంపు అడవిలో సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. అకస్మాత్తుగా మొత్తం ఎనిమిది ఏనుగుల ఆరోగ్యం క్షీణించింది. ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాయి. వాటి పరిస్థితి చూసి సమీప గ్రామస్థులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌కు చెందిన వైద్యులు, అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. విచారణ అనంతరం నాలుగు ఏనుగులు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరో నాలుగు ఏనుగుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మందలో మిగిలి ఉన్న 5 ఏనుగులను కూడా అటవీ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.