Arvind Kejriwal

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు కేంద్రం కొత్త బంగళా కేటాయింపు

Arvind Kejriwal: ఆప్ జాతీయ కన్వీనర్ , దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్రం అధికారిక నివాసాన్ని కేటాయించింది. 95, లోధి ఎస్టేట్ లోని టైప్ 7 బంగళాలో ఆయన ఉండనున్నట్లు తెలిపింది. గత ఏడాది దిల్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్ … ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిత్తల్ కు కేటాయించిన బంగళాలో తాత్కాలికంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే గుర్తింపుపొందిన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా కేజ్రీవాల్ కు తగిన నివాసం కేటాయించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం…కేజ్రీవాల్ కు నూతన బంగళాను కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

మరోవైపు, సీఎంగా ఉన్న సమయంలో సివిల్ లైన్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని ఆరో నంబరు బంగళాను అధికార నివాసంగా ఉపయోగించిన కేజ్రీవాల్ …దానికి అనేక హంగులు చేసి పునర్నిర్మించారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కేజ్రీవాల్ ఉంటున్న నివాసాన్ని’శీష్ మహల్ ‘గా పిలుస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం ఈ భవనాన్ని ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా మార్చాలని దిల్లీలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 అక్టోబర్‌లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత, కేజ్రీవాల్‌కు దాదాపు ఒక సంవత్సరం పాటు శాశ్వత నివాసం లేదు. ఈ ఆలస్యంపై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: Viral News: రోగం తాగిస్తా అని దర్గా కి తీసుకెళ్లిన బాబా.. చివరికి కొంపముంచాడు

కోర్టు జోక్యం చేసుకుని, అధికారిక నివాసం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించిన తర్వాత ఈ కేటాయింపు జరిగింది. ఈ టైప్-VII బంగ్లాలో నాలుగు బెడ్‌రూమ్‌లు, హాల్, డైనింగ్ రూమ్, వెయిటింగ్ రూమ్, రెండు లాన్‌లు, క్యాంప్ ఆఫీస్ గదులు మరియు సిబ్బంది నివాసాలు ఉన్నాయి. గతంలో ఈ బంగ్లాలో బీజేపీ నాయకుడు, మాజీ నేషనల్ మైనారిటీ కమిషన్ ఛైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పుర నివసించారు. కేజ్రీవాల్‌కు టైప్-VIII బంగ్లా కేటాయించాలని ఆప్ కోరింది, అలాగే మాజీ సీఎం మాయావతి నివసించిన 35, లోధి ఎస్టేట్ బంగ్లాను కోరగా, దానిని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *