Kejriwal: ఆయుష్మాన్ భారత్ పథకం అతిపెద్ద స్కామ్‌గా మారిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ పథకంలో అవకతవకలు ఉన్నట్లు ధృవీకరించడాన్ని సంతోషంగా స్వీకరించిన ఆయన, కేంద్రంలో ప్రభుత్వం మారితే ఈ పథకంలో జరిగిన భారీ అవినీతి బయటపడుతుందని అన్నారు.
ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడంలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభీమ్)ను అమలు చేయడానికి జనవరి 5లోగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేయాలని ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 24న ఆదేశించింది.
అయితే, ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు, కేంద్రం సహా ఇతరులకు నోటీసులు జారీ చేసింది.