Keerthy Suresh: ముద్దుగా బొద్దుగా మురిపించిన కీర్తి సురేశ్ ‘మహానటి’తో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘మహానటి’గా జనం మదిలో నిలచిపోవడమే కాదు, నేషనల్ అవార్డునూ సొంతం చేసుకున్న కీర్తి సురేశ్ కు పెళ్ళంట అంటూ చాలా రోజులుగా వినిపిస్తోంది. కేరళకు చెందిన ఓ రాజకీయ నాయకునితో కీర్తి వివాహం జరగబోతోందని అప్పట్లో వినిపించింది. దానిని కీర్తి సురేశ్ వెంటనే ఖండించింది. పైగా తాను నటనపైనే దృష్టిని కేంద్రీకరించానని, కెరీర్ లో ఇంకా ఎన్నో మంచి పాత్రలు పోషించాలని ఉందని చెప్పింది.
ఇది కూడా చదవండి: Nithiin: నితిన్, విక్రమ్ కుమార్ తో యువీ క్రియేషన్స్ చిత్రం
Keerthy Suresh: ఆ తరువాత ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తోనూ కీర్తి సురేశ్ పేరు ముడిపడింది. వారిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటారనీ విశేషంగా వినిపించింది. మళ్ళీ కీర్తి ఆ వార్తనూ ఖండించింది. ఇప్పుడు మరోమారు కీర్తి పెళ్ళి కూతురు కాబోతోందని టముకు సాగుతోంది. డిసెంబర్ లో కీర్తి సురేశ్ పెళ్ళి జరగనుందని, అది గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ అని తెలుస్తోంది. మరి ఈ సారి కూడా కీర్తి ఖండిస్తుందో, లేక ఇది నిజమే అని చెబుతుందో చూడాలి.