Nithiin: నితిన్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్’ సినిమా నితిన్ కెరీర్ కి ఊపిరి పోసింది. 12 క్రితం ‘ఇష్క్’ కోసం జత కట్టిన వీరిద్దరూ ఆ తర్వాత మల్ళీ కలసి నటించలేదు. ఇన్నేళ్ళ తర్వాత మరో సినిమా చేస్తున్న వీరిద్దరికీ నిర్మాత సెట్ అవటానికి టైమ్ పట్టింది. ముందు ఈ సినిమాను ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి నిర్మిస్తారని వినిపించింది. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ డిజాస్టర్ తో వేరే నిర్మాతలతో చేస్తారని వినిపించింది. మధ్యలో ప్రేమ్ షోనే తీస్తుందని వినవచ్చినా ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ యువీ క్రియేషన్స్ చేతిలో పడింది. ప్రస్తుతం వెంకీ కుడుములతో నితిన్ చేస్తున్న ‘రాబిన్ హుడ్’ డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది.
ఇది కూడా చదవండి: Rashmika-Vijay Devarakonda: మరోసారి వార్తల్లో రశ్మిక-విజయ్ దేవరకొండ!
Nithiin: ఆ తర్వాత వేణు శ్రీరామ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. దిల్ రాజు సంస్థలోనే ‘బలగం’ వేణుతో చేయవలసిన ‘ఎల్లమ్మ’ షూటింగ్ మొదలు కావలసి ఉంది. ఇప్పడు యువీ క్రియేషన్స్ లో విక్రమ్ కుమార్ తో చేసే సినిమా, ‘ఎల్లమ్మ’ రెండూ ప్యారలల్ గా జరుగుతాయట. విక్రమ్ కుమార్ తో పాటు ఇటు యువీకి, నితిన్ కి కూడా సక్సెస్ ఎంతో అవసరం. అప్పట్లో ‘ఇష్క్’తో హిట్ కొట్టిన నితిన్, విక్రమ్ ఈ సినిమాతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తారేమో చూద్దాం.