Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ – నారాయణపూర్ సమీపంలో మహారాష్ట్ర సరిహద్దులో భద్రతా దళాలు ఐదుగురు నక్సలైట్లను హతమార్చాయి. వీరిలో 2 మంది మహిళలు, 3 మంది పురుషులు ఉన్నారు. అన్ని మృతదేహాలు, ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. పలువురు నక్సలైట్లు గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు, వారిని విమానంలో రాయ్‌పూర్‌కు తరలించారు. డాక్టర్స్ చెబుతున్న వివరాల ప్రకార, బుల్లెట్ ఒక సైనికుడి తొడలో దూసుకుపోయింది. మరొకరి తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
ఇది కూడా చదవండి: Fake Documents: నకిలీ డాక్యుమెంట్స్ తో బ్యాంక్ అకౌంట్స్.. ముఠా అరెస్ట్
Encounter: ఎన్‌కౌంటర్‌ను కాంకేర్ ఎస్పీ ఐకే అలిసెలా ధృవీకరించారు. బస్తర్‌లోని దాదాపు అన్ని జిల్లాలకు చెందిన DRG జవాన్లు, మహారాష్ట్రలోని C-60 కమాండోలు నక్సల్ సంస్థ సెంట్రల్ కమిటీ సభ్యుడు అభయ్‌ను పట్టుకోవడానికి భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
Encounter: నారాయణపూర్ – కాంకేర్‌కు ఆనుకుని ఉన్న ఉత్తర అబుజ్‌మద్‌లో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో శనివారం ఉదయం 6 గంటలకు DRG, STF, BSF సంయుక్త బృందాన్ని పంపించారు. ఈ ఎన్‌కౌంటర్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కొన్ని గంటలపాటు అడపాదడపా కాల్పులు జరిగాయి. నక్సలైట్లు ఈ ప్రాంతం నుండి మహారాష్ట్ర వైపు పారిపోకుండా నిరోధించేందుకు, కంకేర్ జిల్లాకు ఆనుకుని ఉన్న గడ్చిరోలి ప్రాంతంలో C-60 కమాండోలను మోహరించారు.