Keerthy Suresh: సౌత్ సినిమాల్లో హీరోయిన్లు పెళ్లి తర్వాత తెరమరుగవడం సర్వసాధారణం. కానీ, కీర్తి సురేష్ మాత్రం ఈ ట్రెండ్‌ను తిరగరాస్తోంది. పెళ్లైన ఏడాది లోపే ఆమె అరడజను సినిమాలకు సైన్ చేసి సత్తా చాటుతోంది. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్, రెండు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి, తమిళంలోనూ రెండు సినిమాల షూటింగ్‌లో ఉంది. మరో మూడు-నాలుగు ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.
Also Read: Nayanthara: భర్తపై ఫైర్.. సంచలనం సృష్టిస్తున్న నయనతార పోస్ట్!
Keerthy Suresh: తెలుగులో చాలా కాలం తర్వాత ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె, విజయ్ దేవరకొండతోనూ ఓ చిత్రంలో నటించేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. పెళ్లి తర్వాత కూడా ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం కీర్తికి దక్కిన అరుదైన ఘనత అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆమె మరిన్ని తెలుగు సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ ఈ జోరుతో సౌత్ సినీ ఇండస్ట్రీలో మరెన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.