Top 5 OTTS: ఒటిటి ప్లాట్‌ఫామ్‌లలో అత్యధిక వీక్షకులను ఆకర్షించిన టాప్ 5 ఒరిజినల్ సిరీస్‌ల జాబితా వచ్చేసింది. ఓర్మాక్స్ మీడియా ఆడియన్స్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ‘పంచాయత్ సీజన్ 4’ 8.8 మిలియన్ వీక్షణలతో మొదటి స్థానంలో నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో హాస్యం, భావోద్వేగాలు కలగలిపిన ఈ సిరీస్ వీక్షకుల మనసు గెలిచింది. రెండో స్థానంలో నెట్‌ఫ్లిక్స్‌లోని ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ 4.8 మిలియన్ వీక్షణలతో ఉత్కంఠభరిత కథనంతో ఆకట్టుకుంది. మూడో స్థానంలో జియో హాట్ స్టార్ లోని ‘క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్’ 4.5 మిలియన్ వీక్షణలతో సస్పెన్స్‌తో మెప్పించింది.నాల్గవ స్థానంలో నెట్‌ఫ్లిక్స్‌లోని ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3’ 3.8 మిలియన్ వీక్షణలతో హాస్యంతో వినోదం అందించింది. ఐదో స్థానంలో జియో హాట్ స్టార్ లోని ‘కేరళ క్రైం ఫైల్స్ సీజన్ 2’ 3.4 మిలియన్ వీక్షణలతో క్రైమ్ థ్రిల్లర్‌గా ఆకర్షణీయంగా నిలిచింది. ఈ జాబితా ఒటిటి కంటెంట్‌పై పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.
