Nayanthara: సౌత్ సినిమా సూపర్‌స్టార్ నయనతార ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాతో సహా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తల్లిగా కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేస్తూ, కెరీర్‌లో దూసుకుపోతున్న ఆమె పేరిట ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌లో వివాదాస్పద, కఠినమైన వ్యాఖ్యలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శించినట్లు కనిపిస్తోంది. “ఒక తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వివాహం పొరపాటే. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.”
Also Read: Niharika Konidela: పూజా కార్యక్రమాలతో నిహారిక లేటెస్ట్ మూవీ ఘనంగా ప్రారంభం!
Nayanthara: అని ఆ పోస్ట్‌లో ఉంది. కానీ, ఈ పోస్ట్‌ను పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేయడంతో, అది వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ నయనతార స్వయంగా రాసిందా లేక ఎవరో ఆమె పేరును ఉపయోగించి ప్రచారం చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నయనతార టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
#Nayanthara posted this and deleted. Nayan, blink twice if you’re in trouble#Nayanathara #Nayantharahot #Kollywood #KollywoodCinima #ThalapathyVijay #thuglife pic.twitter.com/nFagYf0112
— Gsp Gani Vj (@Gspganivj) July 3, 2025