Keerthy Suresh: జాతీయ ఉత్తమ నటి, అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేశ్ ఈ యేడాది బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. తమిళ చిత్రం ‘తేరీ’ రీమేక్ ‘బేబీ జాన్’లో కీర్తి నటిస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలోని కీర్తి సురేశ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ శారీలో మెరిసిపోతున్న కీర్తి సురేశ్ ఫోటోను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అందం, అభినయంతో తమ అభిమాన నటి బాలీవుడ్ లో జెండా పాతేయడం ఖాయమని వారు భావిస్తున్నారు. గతంలోనూ ఎంతోమంది దక్షిణాది భామలు ఉత్తరాదిన స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. గత యేడాది నయనతార ‘జవాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా ఈ యేడాది ఆ ఛాన్స్ ను కీర్తి సురేశ్ దక్కించుకుంది.
