Gnana Shekar: సినిమాటోగ్రాఫర్ గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞానశేఖర్. తన పనితనంతోనే కాకుండా అందరికీ సాయం చేసే వ్యక్తిగానూ జ్ఞానశేఖర్ కు మంచి పేరు ఉంది. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా కథ నచ్చాలే కానీ ఆయన అంగీకారాన్ని తెలుపుతారు. అలానే దర్శకుల విషయంలోనూ సీనియర్, జూనియర్ అనే తేడా కూడా చూపించారు. క్రిష్ దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాలకు వర్క్ చేసిన జ్ఞానశేఖర్ ఇటీవల విడుదలైన ‘జితేందర్ రెడ్డి’కీ వర్క్ చేశారు. తాజాగా ఆయనకు ఐ.సి.ఎస్. గౌరవం దక్కింది. సినిమాటోగ్రాఫర్ గా చక్కని పనతనం పొందిన వారికి ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రఫీ నుండి గుర్తింపు లభిస్తుంది. ఇకపై జ్ఞానశేఖర్ టైటిల్ కార్డ్స్ లో తన పేరు పక్కన ఐ.ఎస్.సి. అని వేసుకోవచ్చు. జ్ఞానశేఖర్…. క్రిష్ దర్శకత్వం వహించిన ‘వేదం, గౌతమీపుత్ర శాతకర్ణి, మణికర్ణిక” వంటి చిత్రాలకు వర్క్ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.