Revolver Rita: కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ‘రివాల్వర్ రీటా’ అనే తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో కీర్తి నటించిన తొలి చిత్రం ‘బేబీ జాన్’ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుండగా మరో సినిమా ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకు కడ్డిపూడి చంద్రు దర్శకత్వం వహించారు. ఇటీవల కీర్తి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. జెకె చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సుధాన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మిస్తున్నారు. సీన్ రోల్డన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను హాస్య మూవీస్ అధినేత రాజేష్ దండా పొందారు. రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా నిర్ణయించలేదు. రాధిక శరత్కుమార్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్ల్సే, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ ఇందులోని ఇతర ముఖ్యపాత్రధారులు.
