Kiran Kumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘కేడి’ సినిమా దర్శకుడు కిరణ్ కుమార్ బుధవారం తన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాల వల్ల బాధపడుతున్న ఆయన, ఈరోజు ఉదయం మరణించారు.
2010లో నాగార్జునతో తీసిన ‘కేడి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందారు. ఆ తర్వాత మరో సినిమా చేయని ఆయన, తాజాగా “కింగ్ జాకీ క్వీన్” (KJQ) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా ఆయనకు ఆరోగ్య సమస్యలు రావడంతో షూటింగ్ ఆలస్యమైంది. తిరిగి షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే ఈరోజు ఉదయం ఆయన మరణించారు.

