KCR: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌పై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. మే 6న అర్ధరాత్రి త్రివిధ సాయుధ దళాల ఆధ్వర్యంలో 9 ఉగ్ర శిబిరాలపై జరిగిన దాడిని భారత్ ఆపరేషన్ సిందూర్‌గా ప్రకటించింది. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తన అభిప్రాయ వెలిబుచ్చారు.
KCR: ఎప్పటికైనా ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు. భారత సై్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదు.. అని కేసీఆర్ చెప్పారు.
KCR: భారత్ సైన్యం ఎంత వీరోచితంగా ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిందో.. అంతే అప్రమత్తంగా ఉండి, దేశ రక్షణలో మేమెవరికీ తీసిపోము అన్నట్టుగా వారికి శక్తిసామర్థ్యాలను ప్రసాదించాలని ఆ దేవుడిని తాను కోరుకుంటున్నట్టు కేసీఆర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో సానుకూలత ఉన్న ప్రపంచ దేశాలన్ని ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి పరిఢవిల్లుతుందని కేసీఆర్ కోరారు.