Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: మ‌హాన్యూస్‌పై దాడిపై కేసీఆర్‌, కేటీఆర్ క్ష‌మాప‌ణ చెప్పాలి: టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌

Mahesh Kumar Goud: హైద‌రాబాద్‌లోని మ‌హాన్యూస్ చాన‌ల్ ప్ర‌ధాన కార్యాల‌యంపై బీఆర్ఎస్ దాడి హేయ‌మైన చ‌ర్య అని టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌ విమ‌ర్శించారు. ఈ దాడి ఘ‌ట‌న‌పై బాధ్య‌త‌గా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. టీవీ చాన‌ల్‌పై గూండాలు, రౌడీల్లాగ వ‌చ్చి దాడులు చేశార‌ని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌ని బీఆర్ఎస్ నేత‌లు చూశార‌ని ఆరోపించారు. రాజ‌కీయ నాయ‌కులు, సినీ న‌టులు, జ‌డ్జిలు, అధికారుల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇంత పెద్ద ట్యాపింగ్ వ్య‌వ‌హారం ఇదే మొద‌టిసారిద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. వ్య‌క్తుల ప్రైవేటు స్వేచ్ఛ‌ను హ‌రించే హ‌క్కు ఎవ‌రిచ్చార‌ని ప్ర‌శ్నించారు. గ‌త సీఎం, మంత్రులు, డీజీపీ, సీఎస్‌పై కేసు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కార‌ణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

ఇది కూడా చదవండి: Maha News Office Attack: మహాన్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన శ్రీకాకుళం జర్నలిస్ట్ సంఘాలు

ఫోన్ ట్యాపింగ్ విష‌యంలో మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌గౌడ్ ప్ర‌శ్నించారు. కేసీఆర్ మౌనం, కేటీఆర్ దౌర్జ‌న్య ధోర‌ణి ట్యాపింగ్‌కు అంగీక‌ర‌మా? అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా మ‌హాన్యూస్‌పై జ‌రిగిన దాడికి కేసీఆర్‌, కేటీఆర్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మ‌హేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *