KCR: కాళేశ్వర కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి నేరుగా బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ బయలుదేరే ముందు ఎర్రవల్లి నివాసానికి పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు మద్దుతు తెలిపారు.
KCR: ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయన బయలుదేరే ముందు ఆయనకు ఓ కార్యకర్త దట్టీకట్టి సాగనంపారు. ఆయన వెంట బీఆర్ఎస్ కీలక నేతలైన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
KCR: పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపే బీఆర్‌కే భవన్ వద్దకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, నాయకులు భారీగా తరలివచ్చారు. ఆవరణలోకి ఆయన కారు రాగానే కేసీఆర్ కు మద్దుతుగా నినిదాలు చేశారు. ఆయన వెంట కీలక నేతలైన హరీశ్‌రావు, మహమూద్ అలీ తదితరులు ఉండగా, ఆయన నేరుగా లోపలికి వెళ్లారు.