KCR: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రభావంపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పందించారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడంపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KCR: వరద ప్రభావిత ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నేతలను తాను మాట్లాడినట్టు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. ఇప్పటికే వరద తీవ్రత ఉన్న ప్రాంతాల ముఖ్య నేతలతో మాట్లాడి తగు సూచనలు చేసినట్టు తెలిపారు. వరద బాధితులకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని కోరినట్టు చెప్పారు.
KCR: రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వరదలతో పలు నివాసాలు నీట మునిగాయని, పలుచోట్ల రోడ్లన్నీ తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతమైందని తెలిపారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడంపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.