Actress Kasthuri

Actress Kasthuri: తెలుగువారికి కస్తూరి క్షమాపణలు

Actress Kasthuri: ఆదివారం చెన్నయ్ లోని ఓ కార్యక్రమంలో నటి, రాజకీయ నాయకురాలు కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. మూడు వందల యేళ్ళ క్రితం అంతఃపుర రాణులకు పరిచర్యలు చేయడానికి తమిళనాడుకు తెలుగువారు వచ్చారంటూ ఆమె మాట్లాడారు. అది డీఏంకే నేతలను ఉద్దేశించి అన్న మాట తప్పితే తెలుగువారిని కించపరచాలని కాదని కస్తూరి వివరణ ఇచ్చినా… నిరసనలు ఆగలేదు. పైగా ఆమెపై పలు కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలో కస్తూరి తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, తెలుగువారిని క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. డీఎంకే కు చెందిన కొందరు తనను, తెలుగువారికి దూరం చేసేందుకు తన మాటలను వక్రీకరించి ప్రచారం చేశారంటూ ఆమె వాపోయారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశంలో తాను నిజమైన జాతీయ వాదినని కస్తూరి చెప్పుకొచ్చింది. తెలుగువారు తనపట్ల చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని, వారిని కించపరిచే విధంగా ఎప్పుడూ తాను మాట్లాడనని ఆమె పేర్కొంది.

ఇది కూడా చదవండి: Thug Life: కమల్ “థగ్ లైఫ్” టీజర్ తేదీ వచ్చేసింది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Raana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు: రానాకు ఈడీ మరోసారి నోటీసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *