DACOIT Glimps: అడివి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డకాయిట్’ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. దర్శకుడు షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమాకు సంబంధించి ఫైర్ గ్లింప్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ లో మృణాల్ ‘జూలియట్’ అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించగా, శేష్ చెప్పిన డైలాగ్ – ‘జూలియట్.. నిన్ను అందరూ మోసం చేశారు. నేను అందుకు రాలేదు..’ ప్రేక్షకుల మనసులను తాకుతోంది. ఈ డైలాగ్ నేపథ్యాన్ని చూస్తే, సినిమాలో ఎమోషన్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ కూడా ఉండబోతోందని అర్ధమవుతోంది.
తాజాగా విడుదలైన ఈ వీడియోలో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాత్రల లుక్స్ అన్నీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇప్పటికే అడివి శేష్ సినిమాలపై మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఈసారి ఆయన కొత్తగా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు టాక్.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, సినిమాటోగ్రఫీ విషయంలోను అత్యున్నత స్థాయి టెక్నికల్ వర్క్ కనిపిస్తోంది. క్రైమ్, ఎమోషన్, రివెంజ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ కథ వినూత్నంగా ఉండనుందని చిత్రబృందం చెబుతోంది.
డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ‘డకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైర్ గ్లింప్స్ చూస్తుంటే, ఈ సినిమా మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ రెండింటిని ఆకట్టుకునేలా ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.