Kannappa Trailer: టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతోన్న ‘కన్నప్ప’ చిత్రం ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచేసింది. విష్ణు మంచు హీరోగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.
ప్రస్తుతం మేకర్స్ ఫుల్ జోష్‌తో ప్రమోషన్స్‌ను టర్బో మోడ్‌లో నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అందరూ ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం గ్రాండ్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టైలిష్ పోస్టర్ సినిమా రిచ్‌నెస్‌ను హైలైట్ చేస్తోంది. మోహన్ బాబు నిర్మాణంలో భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.