BTS Military Discharge

BTS Military Discharge: లేడీ ఫ్యాన్స్‌కు జోష్ న్యూస్.. ఘనంగా బీటీఎస్ సభ్యులు రిటర్న్!

BTS Military Discharge: గ్లోబల్ సెన్సేషన్ బీటీఎస్ గ్రూప్‌లోని RM, V జూన్ 10న తమ సైనిక సేవను పూర్తి చేసి స్వస్థలానికి తిరిగి వచ్చారు. ఈ శుభవార్తతో బీటీఎస్ ఆర్మీ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో వీరి ఫొటోలు, వీడియోలు హోరెత్తిపోతున్నాయి. దక్షిణ కొరియా చట్టం ప్రకారం, 18-35 ఏళ్ల పురుషులు 18-21 నెలలు సైన్యంలో సేవ చేయాలి, మహిళలకు మినహాయింపు ఉంది. 2023లో సైనిక సేవలో చేరిన RM, V తమ బాధ్యతను నెరవేర్చి ఇంటికి చేరారు.2013లో ‘నో మోర్ డ్రీమ్’ ఆల్బమ్‌తో కె-పాప్ రంగంలో అడుగుపెట్టిన బీటీఎస్, అతి తక్కువ సమయంలో భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఈ జూన్ చివరికి ఏడుగురు సభ్యులూ మళ్లీ కలుస్తారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad:చ‌దివింది బీటెక్‌.. చేసేది డ్రగ్స్ సేల్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *