Divya Suresh: కన్నడ బిగ్ బాస్ ఫేమ్, నటి దివ్య సురేష్ బెంగళూరులో హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నారు. ఆమె అతివేగంగా నడుపుతున్న కారు ఒక బైక్‌ను ఢీకొట్టి, బాధితులకు సహాయం చేయకుండా ఆపకుండా వెళ్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అక్టోబర్ 4, తెల్లవారుజామున సుమారు 1:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు (కిరణ్, అనూష, అనిత)ను దివ్య సురేష్ నడుపుతున్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు రోడ్డుపై పడ్డారు. వీరిలో అనిత అనే మహిళ కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. ఆమెకు సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: FIH Junior World Cup 2025: ఇండియాలో జూనియర్ హాకీ వరల్డ్ కప్.. తప్పుకున్న పాక్
బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ బాధితులకు సహాయం చేయకుండా, కారును ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనిత చికిత్సలో ఉండటంతో, బైక్ నడుపుతున్న కిరణ్ మూడు రోజుల తర్వాత అక్టోబర్ 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఫుటేజీలో ప్రమాదం జరిగిన తీరు, కారు నంబర్‌ను గుర్తించారు. ఆ కారు నటి దివ్య సురేష్‌దిగా నిర్ధారించారు ఈ నిర్లక్ష్యంపై పోలీసులు దివ్య సురేష్‌పై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)’ ప్రకారం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం (Section 281), ప్రాణాలకు ముప్పు కలిగించడం (Section 125A) తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి చర్య: దర్యాప్తులో భాగంగా, విచారణకు హాజరు కావాలని దివ్య సురేష్‌కు సమన్లు జారీ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

