Kane Williamson

Kane Williamson: కేన్ మామ కొత్త ఇన్నింగ్స్ – లక్నో సూపర్ జెయింట్స్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియామకం!

Kane Williamson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత గౌరవనీయమైన ఆటగాళ్లలో ఒకరైన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆటగాడిగా కాకుండా, కొత్త పాత్రలో ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయనున్నారు. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫ్రాంఛైజీ అతన్ని తమ స్ట్రాటజిక్ అడ్వైజర్ గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్‌లో గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు గుజరాత్ టైటాన్స్ (GT) జట్లకు నాయకత్వం వహించి, తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలతో పాటు, నిదానమైన, వ్యూహాత్మక నాయకత్వానికి పేరుగాంచిన విలియమ్సన్, ఇప్పుడు తెర వెనుక ఉండి జట్టు విజయానికి తోడ్పడనున్నారు. గాయాల కారణంగా, ఫ్రాంఛైజీ వ్యూహాల మార్పు వల్ల ఇటీవల ఐపీఎల్ వేలంలో విలియమ్సన్‌ను ఏ జట్టు దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో, అతని అనుభవాన్ని, క్రికెట్ మేధస్సును ఉపయోగించుకునేందుకు లక్నో ఫ్రాంఛైజీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: Australia vs Bangladesh: బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీ-ఫైనల్స్‌లోకి ఆస్ట్రేలియా

స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఏం చేస్తాడంటే?

మ్యాచ్‌లు,టోర్నమెంట్ అంతటా జట్టు యొక్క వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించడంలో కోచింగ్ బృందం, కెప్టెన్‌కు సహాయం చేయడం.
ఐపీఎల్ మెగా వేలం, మినీ వేలంలో ఆటగాళ్ల ఎంపిక, బడ్జెట్ నిర్వహణ, లక్ష్య ఆటగాళ్ల జాబితాను ఖరారు చేయడంలో తన అంతర్జాతీయ అనుభవాన్ని ఉపయోగించడం.
జట్టులోని యువ క్రికెటర్లకు, ముఖ్యంగా కొత్త నాయకులకు, క్రికెట్ నైపుణ్యాల, ఒత్తిడి నిర్వహణపై విలువైన మార్గదర్శకత్వం అందించడం.
జట్టు కెప్టెన్ , ప్రధాన కోచ్ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం.

కేన్ విలియమ్సన్ నియామకంపై లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని, మేనేజ్‌మెంట్ సంతోషం వ్యక్తం చేసింది. “కేన్ విలియమ్సన్ లాంటి అత్యుత్తమ క్రికెట్ మెదడు మా జట్టులో భాగం కావడం మాకు గొప్ప బలం. అతని అనుభవం, ప్రశాంతత, మరియు ఆటపై ఉన్న లోతైన అవగాహన రాబోయే సీజన్లలో మా వ్యూహాత్మక నిర్ణయాలకు చాలా కీలకం అవుతుంది” అని ఫ్రాంఛైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటగాడి నుంచి మెంటార్/సలహాదారు పాత్రకు మారిన విలియమ్సన్, లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐపీఎల్ టైటిల్‌ దిశగా నడిపించడంలో ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *